రాంగోపాల్ పేట
సెప్టెంబర్ 21,(జే ఎస్ డి ఎం న్యూస్) :
వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలనీ ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు మర్రి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మర్రి శశిధర్ రెడ్డి ని శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. మర్రి వెంట బిజెపి నాయకులు వి. దయానందరావు ఆయా మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.







