ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని దర్శిలోని స్థానిక పొదిలి రోడ్డు లో గల వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహం లో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమానికి హాష్టల్ వార్డన్ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు . తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. అతిధులుగా తూర్పువెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొల్లూరి ప్రకాష్ రావు, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సెంట్రల్ కన్వీనర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి కపురం శ్రీనివాసరెడ్డి, ప్రముఖ న్యాయవాది గడ్డి శ్రీనివాసులు,విశ్రాంత ఉపాధ్యాయుడు అట్లూరి రామారావు, ఓబయ్య పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగువారికోసం,భారత దేశంలో తెలుగు రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహోన్నతమైన వ్యక్తిని, ఈరోజు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమని ఆయన త్యాగాలను,సేవలను కొనియాడారు.ఎప్పటికీ చిరస్మరణీయులని,విద్యార్థులందరూ ఆయన ఆశయ సాధనకోసం పాటుపడాలని వక్తలందరూ ప్రసంగించారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: