వరి కూటి గెలుపుతో మొక్కులు తీర్చుకున్న జనసేన నాయకులు

ముండ్లమూరు : దర్శి మండల జడ్పిటిసి అభ్యర్థిగా వరుకూటి నాగరాజు లక్ష్మీ తయారు అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరారు. ఆమె గెలిస్తే కాలినడకన దుర్గమ్మ గుడికి వస్తామని మొక్కుకున్నారు. దీంతో జనసేన పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా బరిలోకి దిగిన వరి కూటి నాగరాజు లక్ష్మీ తాయారు భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. దీంతో అనుకున్న ప్రకారం జనసేన నాయకులు తోట లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో వారి స్వగ్రామమైన పొదిలి నుండి విజయవాడకు కాలినడకన బయలుదేరి ముండ్లమూరుకు చేరుకున్నారు. వారిని విశాలాంధ్ర పలకరించింది. కాలినడకన బయలుదేరిన వారిలో ఇట్లా గోపి, షేక్ రసూల్, దారా బాలరాజు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *