ప్రైమరీ హెల్త్ సెంటర్ల డాక్టర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డీఎంహెచైకు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అసోషియేషన్ (ఎపీపీహెచ్సీడీఏ) బాధ్యులు మంగళవారం వినతి పత్రం అందించారు. 15 సంవత్సరాల నుండి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, వేల్పేర్లో పనిచేస్తున్న డీపీహెచ్ఐబ్యు లు సింగిల్ ప్రమోషన్ కూడ పొంది ఉండలేదని చెప్పారు. బేసిక్ పేపై 30శాతం అదనపు ఇన్సెన్టేవ్ ట్రైబల్ పీహెచ్సీలో పనిచేసే వారికి ఇవ్వాలని కోరారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రొగ్రాంకు వెళ్తున్న డాక్టర్లకు రూ.4,500 ప్రతి నెల ఇన్సెస్టీవ్ ఇవ్వాలని కోరారు. ఫీల్డ్లో పలు వైద్యవిభాగపు కార్యక్రమాలలలో పాల్గొనాల్సి ఉన్నందుకు ఎస్ఆర్ఎస్ అటేడెన్స్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. దయచేసి తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎపీపీహెచ్సీడీఓ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కె రాహుల్, జనరల్ సెక్రటరీ డాక్టర్ షేక్ ఖాదర్ మస్తాన్ బి, జిల్లా కోశాధికారి డాక్టర్ రమేష్ కుమార్. మిగిలిన సంఘ బాధ్యులు, డాక్టర్లు పాల్గొన్నారు.

