సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీ జే పీ అభ్యర్థి గా పోటీ చేసిన శ్రీ గణేష్ కమలం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ హఠాత్ పరిణామం కంటోన్మెంట్ బీజేపీ కి బిగ్ షాక్ కు గురిచేసింది. మంగళ వారం మధ్యాహ్నం నియోజక వర్గం పరిధి లోని వార్డ్ 3 సిఖ్ విలేజ్ లోని గాంధీ నగర్ డబుల్ బెడ్రూమ్ ప్రాంతం లో నిర్మిస్తున్న శ్రీ దక్షిణ కాళీ దేవాలయాన్ని శ్రీ గణేష్ సందర్శించారు.అనంతరం కొద్ది సేపటికే శ్రీ గణేష్ టీ పీ సీ సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నివాసం లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ కి మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి అహ్వా నించారు.తాజా గా శాసన సభకు జరిగిన ఎన్ని కలలో బీ ఆరే ఎస్ అభ్యర్థి లాస్యనందిత చేతిలో స్వల్ప ఓట్ల తో శ్రీ గణేష్ పరాజయం పొందారు.కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికలలో పోటీ చేసిన ప్రజా గాయకుడు.యుద్ద నౌక గద్దర్ కుమార్తె వెన్నెల కు ఈ సారి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కే అవకాశాలు లేవన్న చర్చ నడుస్తున్న నేపథ్యం లో శ్రీ గణేష్ కాంగ్రెస్ కండువా కప్పు కోవడం తో కంటోన్మెంట్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కంటోన్మెంట్ ఎమ్మెల్యే గా ఎన్నికైన లాస్య నందిత ఇటీ వల జరిగిన రోడ్ ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన విషయం పాఠకులకు విదితమే.ఆతర్వాత కంటోన్మెంట్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ రోజు ఏవరు ఏ పార్టీ లో వుంటారు. ఎవరు ఏ కండువా కప్పు కుంటారో తెలియని పరిస్థితి వుంది.శ్రీ గణేష్ ను పార్టీ లోకి ఆహ్వానించిన సమయం లో మహేష్ కుమార్ గౌడ్ నివాసం లో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి.మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు. తదితరులు వున్నారు.

