ముస్లీం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఆదుకున్న ఘనత ఈ దేశంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అని దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని రామభద్రాపురం, తూర్పుగంగవరం గ్రామాలలో మంగళవారం రాత్రి మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో నిర్వహించారు. బూచేపల్లి కుటుంబసభ్యులకు మహిళలు, ప్రజలు క్రేన్ సహాయంతో గజ మాలను వేసి ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాలలో ప్రచార రథంపై ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు పాలన అంతా అవినీతి మయం, అక్రమాలే అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకు తిని ఎన్నికలలో ఇచ్చిన ఆరు వందల హామీలను తుంగలో తొక్కారని అన్నారు.
ప్రజలు చంద్రబాబుకు ఓటేస్తే కరువుకు ఓటేసినట్లే అని ఎద్దెవా చేసారు. వైఎస్సార్ స్వర్ణయుగం రావాలన్నా… సంక్షేమ అభివృద్ధి పథకాలు పేదలకు అందాలన్నా జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ దేశంలో దళారి అవినీతి వ్యవస్థను రూపు మాపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండ వైఎస్సార్సీపీ జెండా అని చంద్రబాబు నాయుడు మోసగాడు కావటం వలనే దత్త, ఉత్త పుత్రుడులను నమ్మలేక పోతున్నారని అన్నారు. అందుకే మోదీతో జత కట్టి మోదీ జపం చేస్తున్నారని చెప్పారు. ఎన్ని జెండాలతో ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ జగనన్నకు ఎదుర్కోనే దమ్ము ధైర్యం ఎవరికి లేదని అన్నారు.
ప్రతి కార్యకర్తకు బూచేపల్లి కుటుంబం అన్ని వేళలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. బూచేపల్లి కుటుంబంపై నమ్మకంతో జగనన్న మరోకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినందున మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు వేసి అత్యథిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో మండల ఇన్చార్జిలు చిన్నపురెడ్డి మస్తాన్ రెడ్డి, నరసింహా రెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ షేక్ ఆదాం షరీఫ్ (బుజ్జి), ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి, మాజీ ఎంపీపీలు కోట రామిరెడ్డి, పోశం మధుసూధన రెడ్డి, గోళ్ల పాటి మోషే, జెసీఎస్ యాడిక శ్రీనివాస రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్డీలీ వెంకటేశ్వర రెడ్డి, సొసైటీ అధ్యక్షులు యాడిక యలమందా రెడ్డి, తూర్పుగంగవరం, రామభద్రాపురం సర్పంచిలు నాగమణి, బాపిరెడ్డి వెంకట లక్ష్మమ్మ, ఎంపీటీసీ సభ్యులు షేక్ హబిమున్నిషాబేగం, పుట్టా అంకమ్మ, ఎఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (చందన), తిరుపతి రెడ్డి, పూనూరి దేవదానం, ఇమ్మానియేల్, నాగిరెడ్డి, జక్కుల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

