పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన స్క్వాడ్ అధికారులు

తాళ్లూరు మండలంలో పలు పరీక్షా కేంద్రాలను మంగళవారం స్క్వాడ్ అధికారుల బృందం తనిఖీ చేసారు. తాళ్లూరులో వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సరస్వతి హైస్కూల్ పరీక్షా కేంద్రాలను ఎస్ఎస్సీ పరీక్షల పరిశీలకులు ప్రసన్నకుమార్ పరిశీలించారు. తూర్పుగంగవరంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, జాహ్నవి పాఠశాలలను ప్రత్యేక స్క్వాడ్ అధికారి గిరిధర్ శర్మ పరిశీలించారు. ఆయా కేంద్రాలలో పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. మండలంలోని ఆరు పరీక్షా కేంద్రాలలో 850 మందికి గాను 827 మంది విద్యార్థులు హిందీ పరీక్షకు హాజరు అయ్యారని, 23 మంది గైర్హజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *