బ్యాంక్ లింకేంజీ రుణాలు తీసుకున్న మహిళలు సకాలంలో రుణాలు చెల్లించాలి- యూనియన్ బ్యాంక్ మేనేజర్ వెంకటరెడ్డి

పొదుపు మహిళల అభ్యున్నతి కోసం బ్యాంక్ లు అందిస్తున్న రుణాలను సకాలంలో చెల్లిస్తూ ఆర్థిక సాధికారికత సాధించాలని తూర్పుగంగవరం యూనియన్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్.వెంకటరెడ్డి తెలిపారు. తాళ్లూరు లోని వెలుగు కార్యాలయంలో పొదుపు మహిళలు, విఓఏలతో బ్యాంక్ సెల్స్ హెల్ప్ గ్రూపు రుణాల చెల్లింపుల గురించి బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎంఎంఎస్ అధ్యక్షురాలు ఎం సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్, కెనెరా బ్యాంక్ మేనేజర్లు మాట్లాడారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ బ్యాంక్ లింకేంజీ రుణాలు కొంత మంది పొదుపు మహిళలు సక్రమంగా చెల్లించలేదన్నారు. గ్రూపుల్లో వున్న మహిళలందరూ కాకుండా సగంమంది మాత్రమే బకాయిలు చెల్లి స్తున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం నుండి అందే వడ్డీ రాయితీ పొందే అవకాశం
స్తున్నారన్నారు.
కొన్ని గ్రూపులు పూర్తిగా బ్యాంక్ రుణాలు చెల్లించలేదని దీని వల్ల బ్యాంక్ ల లో పొదుపు మహిళల పరపతి పోతుందన్నారు. కొందరు బకాయి లు నేరుగా చెల్లించకుండా ఇతరులకు ఇచ్చి పంపటంవల్ల రుణాలు జమ జరగటం లేదన్నారు. చెల్లించినట్లుగా చెప్పటంతో పొదుపు మహిళలు నమ్ముతున్నారని,
గ్రూపుల బకాయిలు పేరుక పోతున్నారన్నారు. వివోఏలు కూడా గ్రూపు మహిళలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించారా లేదా అన్న విషయాన్ని గమనించటం లేదన్నారు. వివోఏలు బాధ్యతగా విధులు నిర్వహిస్తూ బకాయిలు వేగవంతంగా
చెల్లించి బ్యాంక్ ల కు జమచేసి మరళా రుణాలు పొంది ఆర్థికంగా వృద్ది చెందేలా చూడాల న్నారు. పొదుపు మహిళలు రుణాలు త్వరిత గతిన చెల్లిస్తే బ్యాంక్లు మరింత ఉత్సాహంగా బ్యాంక్ లింకేజీ రుణాలు పొదుపు మహిళలకు మంజూరు చేయటం జరుగుతుందన్నారు. వెలుగు ఏపీఎం పి.దేవరాజ్ మాట్లాడుతూ …బ్యాంక్ రుణాలు పెండింగ్ వున్న గ్రూపుల వద్దకు అందరం కలిసి కట్టుగా బకాయిలు చెల్లించే విదంగా చూద్దామన్నారు. రుణాలు ఇప్పించటంతో పాటు వసూళ్లపై వివోఏలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురా లుఎం.సుజాత, కెనరాబ్యాంక్ మేనేజర్ ఎ.పృథ్వి, సీసీలు, వివోఏ లు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *