హిందూ సమాజాన్ని ఏకంచే సి క్రమశిక్షణను పెంపొందింటం రాష్ట్రీయ సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లక్ష్యంఅని ఆర్ఎస్ఎస్ ప్రముక్ తిరుపతయ్య తెలిపారు. తాళ్లూరులో బస్టాండ్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ వందసంవత్సరాల వేడుకలు బుధ వారం సాయంత్రం ఘనంగా నిర్వంచారు. ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ హిందూ భావ జాలాన్ని వ్యాప్తి చేయటం, భారతీయ సంస్కృతిని, నాగరికత స్వయం విలువలను నిలబెట్టి ఆదర్శంగా నిలవాలన్నదే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు. స్వాతంత్ర్య అనంతరం ప్రభావంతమైన హిందూ సంస్థగా ఆర్ఎస్ ఎస్ ఎదిగిందన్నారు. ఆర్ఎస్ఎస్ సైద్దాంతికత విశ్వాసాలను దేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయటానికి అనేక పాఠశాలలు, స్వశ్చంద సంస్థలు, అనేక అనుబంధ సంస్థలు ఏర్పడ్డాయన్నారు.
దేశ వ్యాప్తంగా సామాజిక సేవా, సంస్కరణలుచేపట్టటం, ప్రజల పక్షాన నిలిచి అనేక ఉద్యమాలుచేపట్టిందన్నారు.హిందూ ధర్మానికి రక్షణగానిలుస్తున్నఆర్ఎస్ఎస్ కు
ప్రజలు అండగా నిలిచి సనాతన హిందూధర్మాన్ని పరిరక్షించాలన్నారు. ముందుగా ఆర్ఎస్ఎస్ జండాను ఆవిష్కరించి ఆర్ఎస్ఎస్ స్థాపన కర్త కెబిహెగ్దేవార్, గురూజీ గోవర్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాలులు అర్పిచారు. ఈకార్యక్రమంలో
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వై.లక్ష్మీనారాయణరెడ్డి, చందోలు రామారావు, మారం గోవిందరెడ్డి, శ్రీనివాసరావు సిద్దంతి, సాంబిరెడ్డి, సమరతసేవా సభ్యులు నల్లపాటి వెంకటే శ్వర్లు హనుమారెడ్డి, పాల్వాది రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
