సికింద్రాబాద్, నవంబర్ 18, (జే ఎస్ డీ ఎం న్యూస్ )
బోయిగూడ ఫ్లోరా హోటల్ నుంచి మోండా మార్కెట్కు వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జి కింద గచ్చుకు సంబంధించిన ఇనుపరాడ్డు బయటకు వచ్చి ప్రమాదకరంగా వేలాడుతోంది.ఇది వాహనదారులకు ప్రమాదం పొంచి వుంది. ఇది రాత్రి సమయంలో ప్రమాదకరంగా వుంది.సాయిబాబా ఆలయానికి ఆనుకొని ఉన్న బ్రిడ్జి కింద నిత్యం పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
అయితే బ్రిడ్జి కింద కొంత చీకటిగా ఉండటంతో వేలాడుతున్న ఇనుపరాడు వాహనదారులకు సరిగా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ ఇనుపరాడు కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులకు
ఇది ప్రమాదకరంగా మారింది.సంబంధిత రైల్వే, ఇతర అధికార యంత్రాంగం వెంటనే స్పందించిప్రమాదకరంగా వేలాడుతున్న ఇనుపరాడును తొలగించి,భవిష్యత్తులో ఎలాంటి
ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: